News May 19, 2024

హైదరాబాద్‌లో వర్షం

image

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మలక్‌పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కుత్బుల్లాపూర్, చింతల్, కొంపల్లి, జీడిమెట్ల, సికింద్రాబాద్, బేగంపేట, అల్వాల్, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. మిగతా ఏరియాల్లోనూ వాతావరణం చల్లబడింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరి మీ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోందా?

Similar News

News January 22, 2026

ఎస్.జానకి కుమారుడు కన్నుమూత

image

లెజెండరీ సింగర్ ఎస్.జానకి కుమారుడు మురళీ కృష్ణ(65) కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ గాయని చిత్ర వెల్లడించారు. మురళీ మరణ వార్త షాక్‌కు గురి చేసిందని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న మురళీకృష్ణ పలు సినిమాల్లోనూ నటించారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

News January 22, 2026

మార్కెట్ విలువ పెంపు.. రియల్ బూమ్, ఆదాయమే టార్గెట్!

image

AP: రియల్ ఎస్టేట్‌ రంగాన్ని ప్రోత్సహించడం, ఆదాయం పెంచుకోవడమే టార్గెట్‌గా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల <<18911969>>మార్కెట్ విలువ<<>> పెంచాలని నిర్ణయించింది. గతేడాది ఫిబ్రవరి 1వ తేదీన పెంచిన విలువతో దాదాపు 9 నెలల్లోనే రూ.7వేల కోట్లు ఆర్జించింది. ఈసారి కూడా అదే స్ట్రాటజీతో ముందుకు సాగుతోంది. 7-8 శాతం వరకు పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం మార్కెట్ విలువ పెంచే అవకాశం ఉంది.

News January 22, 2026

CCMBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (<>CCMB<<>>) 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీఎస్సీ, పీజీ (నేచురల్ సైన్సెస్, మాలిక్యులర్ బయాలజీ), BE/BTech, MBBS, PhD అర్హతతో పాటు పని అనుభవం గల వారు జనవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in