News March 19, 2024
పలు జిల్లాల్లో వర్షం

TG: ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం HYDలోని దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్‌నగర్, చార్మినార్, కోఠి తదితర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మెదక్(D) కౌడిపల్లిలో ఈదురుగాలులు, వర్షం కారణంగా ఇంటి పైకప్పు కూలి మూడేళ్ల చిన్నారి సంగీత చనిపోయింది.
Similar News
News April 4, 2025
ఒకేసారి ఆస్తి పన్ను చెల్లిస్తే 5% రాయితీ

AP: 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒకేసారి ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఈ నెల 30లోగా చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.
News April 4, 2025
టారిఫ్ లిస్టులో పెంగ్విన్ ద్వీపం.. ట్రంప్.. పాపం!

ట్రంప్ టారిఫ్ లిస్ట్ ప్రపంచాన్ని కలవరపెడుతుంటే సోషల్ ప్రపంచం మాత్రం ఆయన్ను ఆడేసుకుంటోంది. ప్రతీకార సుంకాల లిస్టులో ఆస్ట్రేలియా పరిధిలోని మెక్‌డొనాల్డ్ ద్వీపం (అంటార్కిటికా ఖండ ఉపభాగం) కూడా ఉంది. ఈ ద్వీపంలో మనుషులే ఉండరు. పెంగ్విన్లు మాత్రమే నివసించే ఈ ప్రాంతం కూడా 10% దిగుమతి టారిఫ్‌కు గురవడంతో మీమర్స్ బుర్రను షార్ప్ చేసి ట్రంప్‌ను చెక్కేస్తున్నారు. పైన గ్యాలరీలో మీరు కొన్ని మీమ్స్ చూడవచ్చు.
News April 4, 2025
రోజా గురించి మాట్లాడాలంటేనే రోతగా ఉంది: మంత్రి సంధ్యారాణి

AP: వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రూ.కోట్లు దోచుకున్నారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. మాజీ మంత్రి రోజా గురించి మాట్లాడాలంటేనే రోతగా ఉందని వ్యాఖ్యానించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడినందుకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. రెడ్‌బుక్ పేరు చెబితేనే వైసీపీ నేతలకు వణుకు పుడుతోందని సంధ్యారాణి అన్నారు.