News October 11, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షం

TG: రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ వీటితో పాటు నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లోనూ వానలు కురుస్తాయని పేర్కొంది. .
Similar News
News October 11, 2025
రికార్డులు తిరగరాస్తున్న యువ సంచలనం

టెస్టుల్లో భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్ దూసుకెళ్తున్నారు. అతడు అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు టెస్టుల్లో ఎక్కువ రన్స్ చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. జైస్వాల్ 48 ఇన్నింగ్సుల్లో 7 సెంచరీలతో 2,418 రన్స్ చేయగా రూట్ (ఇంగ్లండ్) 44 ఇన్నింగ్సుల్లో 2,307 పరుగులు చేశారు. ఆ తర్వాత డకెట్ 1,835, గిల్ 1,796, బ్రూక్ 1,792, పోప్ 1,471 ఉన్నారు.
News October 11, 2025
peace deal: ట్రంప్ అల్లుడిదే కీలక పాత్ర!

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పీస్ డీల్ తొలిదశ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం వెనుక ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌దే కీ రోల్ అని సమాచారం. చర్చలకు హమాస్ ఓకే చెప్పినా.. ఇజ్రాయెల్ తొలుత అంగీకరించలేదు. దీంతో రాయబారి స్టీవ్ విట్కాఫ్‌తో కలిసి కుష్నర్ రంగంలోకి దిగారు. తన వ్యాపార అనుభవంతో నెతన్యాహుతో పలుమార్లు మాట్లాడి ఒప్పించారు. తర్వాతి దశ చర్చల్లోనూ కుష్నర్ పాల్గొంటారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
News October 11, 2025
హార్దిక్ GF మహిక గురించి తెలుసా?

క్రికెటర్ హార్దిక్ పాండ్య గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మ(24) సినిమాల్లో నటించడంతో పాటు మోడలింగ్ చేస్తున్నారు. తనిష్క్, వివో, Uniqlo వంటి బ్రాండ్ల ప్రకటనలతో పాటు పలు మ్యూజిక్ వీడియోలు, ఇండిపెండెంట్ ఫిల్మ్స్‌లో నటించారు. ఇన్‌స్టాలో ఫిట్‌నెస్, మోడలింగ్‌కు సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. ఎకనామిక్స్&ఫైనాన్స్‌లో డిగ్రీ చేశారు. ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో మోడల్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు.