News August 23, 2025
రానున్న 2 గంటల్లో వర్షం!

TG: హైదరాబాద్‌లో రానున్న 2 గంటల్లో తేలికపాటి వర్షం పడుతుందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా GHMCలోని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు నార్త్, ఈస్ట్ తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు వాన పడొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Similar News
News March 23, 2026
హార్ముజ్‌లో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

అమెరికా ఎయిర్ ఫోర్స్ రిటైర్ చేయాలనుకున్న పాత యుద్ధ విమానం ‘A-10 థండర్‌బోల్ట్’ (Warthog) ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ స్పీడ్ బోట్లను వేటాడటంలో కీలకంగా మారింది. నిమిషానికి 3,900 రౌండ్లు కాల్చే దీని పవర్‌ఫుల్ గన్ శత్రువులకు వణుకు పుట్టిస్తోంది. ఆధునిక F-35 విమానాలు ఖరీదైనవి కావడంతో తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులను తట్టుకోగల ఈ ‘ఫ్లయింగ్ ట్యాంక్’ సామర్థ్యం ఇప్పుడు అమెరికాకు వరంగా మారింది.
News March 23, 2026
మీ BPని పెంచే ‘డేంజర్’ ఫుడ్స్ ఇవే!

హై BP గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. రోజూ తినే ప్రాసెస్డ్ మీట్, క్యాన్డ్ సూప్స్, వైట్ బ్రెడ్ వంటి వాటిలో సోడియం విపరీతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరంలో నీటిని నిలిపి ఉంచి BPని పెంచుతాయి. అలాగే కెచప్, సోయా సాస్, ఫ్రోజెన్ పిజ్జాలు, కూల్ డ్రింక్స్‌లోని చక్కెర కూడా హాని చేస్తాయి. అందుకే ఉప్పు, చక్కెర తగ్గించి.. తాజా కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే BP కంట్రోల్‌లో ఉంటుంది.
News March 23, 2026
ఈ యుద్ధం ట్రంప్ కొనితెచ్చుకున్న సమస్య: మాజీ CIA

ఇరాన్ యుద్ధం ట్రంప్ కొనితెచ్చుకున్న సమస్య అని మాజీ CIA లియోన్ పనెట్టా విమర్శించారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తుందని తెలిసినా ట్రంప్ యంత్రాంగం ముందస్తు ప్రిపరేషన్ లేకుండా యుద్ధానికి దిగిందని మండిపడ్డారు. ఈ దాడుల వల్ల ఇరాన్ బలహీనపడకపోగా మరింత కఠినమైన నాయకత్వం చేతుల్లోకి వెళ్లిందని విశ్లేషించారు. USలో పెరుగుతున్న ఇంధన ధరలు, 59% ప్రజల వ్యతిరేకత ట్రంప్‌ను ఇరకాటంలో నెట్టాయన్నారు.


