News July 23, 2024

ఈ జిల్లాల్లో కాసేపట్లో వర్షం

image

TG: రాష్ట్రంలో నిన్న కాస్త తెరిపిచ్చిన వర్షం ఇవాళ మళ్లీ మొదలైంది. హైదరాబాద్‌లో ఉదయం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. అయితే జిల్లాల్లోనూ రానున్న 3 గంటల్లో మోస్తరు వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయని పేర్కొంది.

Similar News

News March 26, 2026

నెల్లూరు: ఘోర ప్రమాదం.. సంచలన విషయాలు

image

మార్కాపురంలో ప్రమాదం జరగకముందే బస్సు కండిషన్ బాగోలేదని ప్రయాణికులు డ్రైవర్‌కు చెప్పారంట. జగిత్యాల నుంచి నెల్లూరు(D) వింజమూరుకు నిన్న సాయంత్రం ఈ బస్సు బయల్దేరింది. ఎర్రగొండపాలెం వద్ద మరమ్మతులకు గురికావడంతో గంటపాటు రిపేర్ చేశారని సమాచారం. సంక్రాంతి సమయంలోనూ ఈ బస్సుకు భారీగా ఫైన్ పడినట్లు తెలుస్తోంది. మార్కాపురం వద్ద స్టీరింగ్ స్ట్రక్ట్ కావడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ అధికారుల విచారణలో చెప్పాడు.

News March 26, 2026

చరణ్‌‌కు సర్జరీ.. వైద్యుడికి చిరు థాంక్స్

image

‘పెద్ది’ చిత్ర షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా హీరో రామ్ చరణ్ కంటిరెప్ప పైభాగంలో చిన్న గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సకాలంలో శస్త్రచికిత్స చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు నైపుణ్యంతో చేసిన సర్జరీ మాకు నిజంగా ఓ వరంలాంటిది. ఆ సమయంలో మేమెంతో ఆందోళన చెందినా మీ నైపుణ్యం దానిని తొలగించింది. మీకు కృతజ్ఞులం’ అని చిరు ట్వీట్ చేశారు.

News March 26, 2026

మార్కాపురం ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

image

AP: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2లక్షలు.. గాయపడ్డ వారికి ₹50వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామన్నారు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి తెలిపారు. ఏపీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధిత కుటుంబాలకు సహకారం అందించాలని సీఎస్‌ను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై సంతాపం తెలిపిన జగన్ ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.