News August 19, 2024
ఈ జిల్లాల్లో కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మ.1-5 గంటల మధ్య వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అటు ఏపీలోని అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి.
Similar News
News November 12, 2025
టెర్రరిజంపై అమెరికా ద్వంద్వ నీతి.. మరోసారి బట్టబయలు!

టెర్రరిజం విషయంలో అమెరికా ద్వంద్వ నీతి మరోసారి బట్టబయలైంది. భారత్లో దాడులు జరిగితే ఒకలా, పాక్లో అయితే మరోలా స్పందించింది. ఎక్కడా టెర్రరిజం అనే పదం వాడకుండా ఢిల్లీ పేలుడుపై US ఎంబసీ ట్వీట్ చేసింది. అదీ ఘటన జరిగిన ఒకరోజు తర్వాత ఓ పోస్టుతో మమ అనిపించింది. పాక్లో దాడులు జరిగితే మాత్రం వెంటనే స్పందించి మొసలి కన్నీరు కార్చింది. టెర్రరిజంపై పోరులో పాకిస్థాన్కు సంఘీభావం తెలుపుతున్నట్లు ట్వీట్ చేసింది.
News November 12, 2025
అలర్ట్.. వచ్చే వారం రోజులు జాగ్రత్త!

TG: రాబోయే వారం రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఆస్కారం ఉందని తెలిపింది. దీంతో జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో కూడిన సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందవచ్చని హెచ్చరించింది. గర్భిణులు, 65 ఏళ్లు పైబడిన వారు, 5 ఏళ్ల లోపు పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News November 12, 2025
భారత్కు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: ఇజ్రాయెల్ పీఎం

ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనను ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఖండించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. భారత్కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ‘భారత్, ఇజ్రాయెల్ శాశ్వత సత్యాలపై ఆధారపడిన పురాతన నాగరికతలు. మన నగరాలపై దాడులు జరగొచ్చు. కానీ అవి మనల్ని భయపెట్టలేవు. ఇరు దేశాల వెలుగు శత్రువుల చీకట్లను తరిమేస్తుంది’ అని ట్వీట్ చేశారు.


