News December 1, 2024
‘బూడిద’తో కాసుల వర్షం.. అందుకే పోటీ!
AP: జమ్మలమడుగు పరిధిలోని RTPPలో ఫ్లైయాష్(బూడిద) కోసం ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్ మధ్య <<14738601>>గొడవ<<>> చర్చనీయాంశంగా మారింది. పేరుకు బూడిదే అయినా ఇది రూ.కోట్లు కురిపించే కల్పవృక్షం. RTPPలో రోజూ 19వేల టన్నుల బూడిద ఉత్పత్తవుతుంది. దీన్ని ఉచితంగానే తీసుకెళ్లొచ్చు. సిమెంట్ కంపెనీలు, ఇటుకల ఫ్యాక్టరీల్లో వాడతారు. టన్ను బూడిద రూ.3,400కు చేరడంతో దాన్ని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు.
Similar News
News December 1, 2024
IT రిటర్నులకు ఈ నెల 15 వరకు గడవు పొడిగింపు
2023-2024కు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలుకు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు CBDT వెల్లడించింది. గత నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితోనే గడువుగా ముగియగా పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ అవకాశం కల్పించినట్లు తెలిపింది.
News December 1, 2024
OTTలో అదరగొడుతున్న తెలుగు సినిమా
దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా OTTలో దూసుకుపోతోంది. 15 దేశాల్లో టాప్-10 లిస్టులో చోటు దక్కించుకుంది. ఈ మూవీ నవంబర్ 28 నుంచి Netflixలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. డబ్బు చుట్టూ తిరిగే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
News December 1, 2024
UK ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ రాజీనామా.. ఎందుకంటే?
UK ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ లూయిస్ హై అనుకోకుండా చేసిన ఓ తప్పిదం తన పదవికి రాజీనామా చేసేలా చేసింది. 11ఏళ్ల క్రితం ఆమె వస్తువులు దొంగతనానికి గురవగా పోలీస్ కంప్లైంట్‌లో మొబైల్ కూడా చేర్చారు. కానీ మొబైల్ ఇంట్లోని కబోర్డులో కనిపించినా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. తర్వాత లొకేషన్ ట్రాక్ చేసి ఆమెను పోలీసులు విచారించారు. ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఆమె రాజీనామా చేశారు.