News August 30, 2024

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ అతిభారీ <<13972066>>వర్షాలు<<>> కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రానున్న 2 గంటల్లో రాష్ట్రంలోని HYD, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మేడ్చల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, RR, సిద్దిపేట జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

Similar News

News January 12, 2026

RVNLలో ఇంజినీర్ పోస్టులు

image

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌(<>RVNL<<>>) 25సైట్ ఇంజినీర్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించనుంది. పోస్టును బట్టి బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. ST/SC/EWS కేటగిరీకి చెందినవారు జనవరి 13న, OBCవారు జనవరి 14న, UR అభ్యర్థులు జనవరి 15న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వెబ్‌సైట్: https://rvnl.org

News January 12, 2026

ఎంగేజ్మెంట్ చేసుకున్న శిఖర్ ధవన్

image

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేయసి సోఫీతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు చేతికి రింగ్ ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2023లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

News January 12, 2026

సివిల్ సూట్ వేసినా.. స్టాప్ ఆర్డర్ వస్తేనే ఊరట

image

‘నల్లమలసాగర్’పై TG పిటిషన్‌ను కాదని సివిల్ సూట్ వేయాలని SC సూచించింది. అయితే సివిల్ సూట్‌ వేస్తే AP సహా గోదావరి బేసిన్‌లోని ఇతర రాష్ట్రాలూ స్పందించాలి. వాటి స్పందనకు ఎంత టైం పడుతుందో తెలియదు. అటు గోదావరి నీటి తరలింపునకు ఫీజిబిలిటీ నివేదికను కేంద్రానికి అందించి DPR టెండర్లకు AP సిద్ధమైంది. ఈ తరుణంలో సివిల్ దావా వేసినా SC స్టాప్ ఆర్డర్ ఇస్తేనే TGకి ఊరట. వరదజలాలే వాడుతున్నట్లు AP వాదిస్తోంది.