News December 6, 2024

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్‌కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Similar News

News October 18, 2025

తెలంగాణ బంద్.. ఇది ఎవరిపై పోరాటం?

image

TG: రాష్ట్ర బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. 42% శాతం రిజర్వేషన్ల కోసం BC సంఘాలు బంద్ చేపట్టాయి. దానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్, కేంద్ర అధికార పార్టీ BJP కూడా మద్దతు తెలిపాయి. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే మరి బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికా? రాష్ట్ర ప్రభుత్వానికా? అసలు పోరాటం ఎవరిపై?

News October 18, 2025

పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

image

టాలీవుడ్‌లో క్రేజీ కాంబో సెట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పవన్‌తో మూవీ లాక్ చేసుకుంది. ఆ అవకాశం తమిళ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు దక్కబోతోందని టాలీవుడ్‌లో టాక్ స్టార్ట్ అయ్యింది. అలాగే డైరెక్టర్ హెచ్.వినోద్ పేరు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు.

News October 18, 2025

కంటెంట్ క్రియేటర్లకు మస్క్ గుడ్‌న్యూస్

image

‘X’ అధినేత ఎలాన్ మస్క్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు. తమ ఫీడ్ రికమెండేషన్ అల్గారిథమ్‌ను మార్చబోతున్నట్లు తెలిపారు. ‘6 వారాల్లో ఫీడ్ రికమెండేషన్ Grok AIకు అప్పగిస్తాం. అది ప్రతి పోస్టు, రోజుకు 100మి+ వీడియోలు చూస్తుంది. ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను రికమెండ్ చేస్తుంది’ అని తెలిపారు. అంటే పేజ్, ఫాలోవర్లతో సంబంధం లేదు. మీ కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే అది ఆటోమేటిక్‌గా వైరలయ్యే ఛాన్సుంటుంది.