News April 4, 2025
కాసేపట్లో వర్షం..

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాబోయే 2 గంటల్లో తూర్పు, దక్షిణ తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విశ్లేషకులు అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Similar News
News April 10, 2025
TCS ఉద్యోగుల హైక్ ఆలస్యం!

ఈ ఏడాది ఉద్యోగుల జీతాల పెంపు ఆలస్యం అవ్వొచ్చని TCS హింట్ ఇచ్చింది. ‘పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి. జీతాల పెంపుపై ఈ ఏడాదిలో నిర్ణయం తీసుకుంటాం. వ్యాపారాన్ని బట్టి అది ఎప్పుడైనా ఉండొచ్చు’ అని చీఫ్ HR మిలింద్ తెలిపారు. 2025 JAN-MARలో TCS కేవలం 625 మంది ఉద్యోగులను మాత్రమే చేర్చుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలోనూ ఫ్రెషర్ల నియామకాలు అంతే లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చని చెప్పారు.
News April 10, 2025
ఈనెల 14న ‘HIT-3’ ట్రైలర్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘HIT-ది థర్డ్ కేస్’ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈనెల 14న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మే 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ అంచనాలను పెంచేసింది.
News April 10, 2025
చైనా వస్తువులపై అమెరికా టారిఫ్ 145%

చైనాపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు 145 శాతానికి పెరిగాయి. బుధవారం చైనా వస్తువులపై 125% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అప్పటివరకు చైనా దిగుమతులపై అమెరికా 20% టారిఫ్ విధిస్తోంది. దీంతో ఆ రెండు కలిపి అది 145 శాతానికి పెరిగింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు 70 దేశాలపై విధించిన సుంకాలను ట్రంప్ 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.