News June 23, 2024

కాసేపట్లో వర్షం

image

TG: ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, KNR, ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, RR, మేడ్చల్-మల్కాజిగిరి, WGL, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. సుమారు 40KM వేగంతో గాలులు వీయొచ్చని పేర్కొంది. మరోవైపు HYDలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వనస్థలిపురం, LBనగర్, హయత్‌నగర్‌లో వరదనీరు రోడ్లపై చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Similar News

News December 5, 2025

పంచాయతీ ఎన్నికలు.. BNSS 163 యాక్ట్ అమలు: సీపీ

image

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత పోలింగ్ జరిగే కొణిజర్ల, రఘునాథపాలెం, బోనకల్లు, వైరా, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలలో సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని పేర్కొన్నారు.

News December 5, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి లైఫ్ సైన్స్ /బయో టెక్నాలజీ/కెమికల్ /కంప్యూటేషనల్ & ఇన్‌ఫర్మేషన్ /ఫార్మాస్యూటికల్/వెటర్నరీ విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nii.res.in

News December 5, 2025

అందుకే IPLకు గుడ్‌బై చెప్పా: ఆండ్రీ రస్సెల్‌

image

వెస్టిండీస్‌ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్‌ IPLకు <<18429844>>గుడ్‌బై<<>> చెప్పిన కారణాన్ని తాజాగా వెల్లడించారు. “ఐపీఎల్‌ ప్రపంచంలోనే అతి పెద్ద టోర్నీ. ప్రయాణాలు, వరుస మ్యాచ్‌లు, ప్రాక్టీస్‌, జిమ్‌ వర్క్‌లోడ్‌ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం సవాలుతో కూడుకున్నది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ నేను ప్రభావం చూపాలి. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగాలని అనుకోవడం లేదు” అని తెలిపారు.