News April 18, 2025
కాసేపట్లో వర్షం!

TG: పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, MBNR, నారాయణపేట్, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి మధ్యలో వర్షాలు పడే అవకాశం ఉందని ట్వీట్ చేశారు.
Similar News
News April 19, 2025
2వేల మందిపై ఇవే చర్యలుంటాయా?: IAS స్మితా

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో AI ఎడిటెడ్ ఫొటోను రీట్వీట్ చేసినందుకు పోలీసులిచ్చిన <<16116901>>నోటీసులపై<<>> IAS స్మితా సబర్వాల్ స్పందించారు. ఇవాళ పోలీసులకు తన స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ఆమె ట్వీట్ చేశారు. ‘ఈ పోస్టును షేర్ చేసిన 2వేల మందిపై ఒకే విధమైన చర్యలుంటాయా? అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్ చేసినట్లు అవుతుంది. అప్పుడు చట్టంముందు అందరూ సమానులే అన్న సూత్రం రాజీపడినట్లవుతుంది’ అని రాసుకొచ్చారు.
News April 19, 2025
ఆ బాధను అబ్బాయిలు భరించలేరు: జాన్వీ కపూర్

మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అబ్బాయిలు క్షణం కూడా భరించలేరని స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. కానీ కొంతమంది పురుషులు ఈ నొప్పిని చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలసరి సమయంలో మహిళలు మానసిక క్షోభ అనుభవిస్తారని చెప్పారు. అలాంటి సమయంలో వారు ఓదార్పు కోరుకుంటారని తెలిపారు. కాగా జాన్వీ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ మూవీలో నటిస్తున్నారు.
News April 19, 2025
ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు

TG: ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయి. Way2Newsలో వేగంగా, సులభంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఏపీ ఇంటర్ ఫలితాలు ఈనెల 12న విడుదలైన సంగతి తెలిసిందే.