News July 15, 2024
కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంగనర్‌లో పిడుగులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా నిన్న హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.
Similar News
News January 30, 2026
కేసీఆర్‌ను ఏమీ పీకలేరు: జగదీశ్ రెడ్డి

TG: ఎన్ని నోటీసులు ఇచ్చినా కేసీఆర్‌ను ఏమీ పీకలేరని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో BRS నేతలను డిస్టర్బ్ చేసేందుకే తమ అధినేతకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. KTR, హరీశ్ రావులకు నోటీసులు ఇస్తే ఎంత మంది తరలివచ్చారో చూశారని వ్యాఖ్యానించారు. అదే కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే ఎన్నికలను పక్కనబెట్టి మరీ లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తారని ప్రభుత్వానికి తెలుసన్నారు.
News January 29, 2026
క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన చంద్రబాబు

క్యాన్సర్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా CM చంద్రబాబు AP క్యాన్సర్ అట్లాస్ విడుదల చేశారు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి రూపొందించిన ఈ అట్లాస్ ద్వారా రాష్ట్రంలోని 2.9 కోట్ల మంది స్క్రీనింగ్ వివరాలను మ్యాపింగ్ చేశారు. దేశంలోనే తొలిసారి క్యాన్సర్‌ను Notifiable Diseaseగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 2030 నాటికి కేసులను తగ్గించడమే లక్ష్యంగా విలేజ్ లెవల్ నుంచే ట్రీట్మెంట్ అందేలా ప్లాన్ చేశారు.
News January 29, 2026
చిరుతతో పోరాడి కొడుకును కాపాడుకున్న వృద్ధుడు!

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో చిరుతతో పోరాడి కొడుకును కాపాడుకున్నాడో వ్యక్తి. బాబుభాయ్(60) ఇంట్లో కూర్చొని ఉండగా చిరుతపులి దాడి చేసింది. అక్కడే ఉన్న శార్దూల్(27) అరవడంతో అతడిపైకి దూకింది. దీంతో కొడుకును కాపాడుకునేందుకు బాబుభాయ్ కొడవలి, ఈటెతో చిరుతను కొట్టి చంపేశాడు. తర్వాత అటవీ అధికారులకు సమాచారమిచ్చాడు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


