News July 18, 2024

కాసేపట్లో వర్షం

image

TG: హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, మల్కాజిగిరి, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, RR, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాల్లో వాన పడనున్నట్లు పేర్కొంది. కాగా ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Similar News

News November 24, 2025

మంథనిలో మహిళా సాధికారతపై మంత్రి శ్రీధర్ బాబు ఫోకస్

image

మంథని ఎక్లాస్‌పూర్‌లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు, మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. VIATRIS సాయంతో 21 కుట్టు కేంద్రాలు, 850 మిషన్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా కుట్టు కేంద్రాలు, మొబైల్ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు వంటి యూనిట్లతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

News November 24, 2025

ముంబైలో “పాతాళ్ లోక్” నెట్‌వర్క్‌

image

ముంబైని ‘ట్రాఫిక్ ఫ్రీ’ నగరంగా తీర్చిదిద్దేందుకు MH ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముంబైలో భారీ టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మిస్తామని CM దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఈ టన్నెల్‌ నెట్‌వర్క్‌ ఇప్పటికే ఉన్న రోడ్లతో ప్యారలల్‌గా ఉంటుందని తెలిపారు. ఈ సొరంగ మార్గాన్ని ఫేమస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్’తో ఫడణవీస్ పోల్చారు. ఈ నెట్ వర్క్‌తో ముంబై ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు.

News November 24, 2025

3 సిక్సులు కొట్టడమే గొప్ప!

image

పాకిస్థాన్‌కు చెందిన జీరో స్టూడియోస్‌ ఆ దేశ క్రికెటర్‌ సాహిబ్జాదా ఫర్హాన్‌పై “Hero in the Making” అనే డాక్యుమెంటరీ తీసింది. దానికి అసలు కారణం ఏంటంటే ఆసియా కప్‌ 2025లో అతను బుమ్రా బౌలింగ్‌లో 3 సిక్సులు కొట్టడమే. కాగా ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ పాక్‌ ఓడిపోవడం తెలిసిందే. దీంతో ‘3 సిక్సులు కొట్టడాన్నే వీళ్లు సక్సెస్‌గా ఫీల్ అవుతున్నారు’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.