News August 22, 2024
ఈ జిల్లాల్లో మొదలైన వర్షం

TG: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం మొదలైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం వాన పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
Similar News
News October 20, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో దత్తగిరి పీఠాధిపతులు

వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్లోని దత్తగిరి పీఠాధిపతులు శ్రీ మహామండలేశ్వర్, సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతులు భద్రకాళి అమ్మవారి సన్నిధిలో దేశ ప్రజల శాంతి, ఐక్యత కోసం ప్రత్యేక పూజలు చేశారు.
News October 20, 2025
TODAY HEADLINES

➣ రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలకు CM CBN గ్రీన్ సిగ్నల్
➣ సిడ్నీలో మంత్రి లోకేశ్.. తెలుగువారితో భేటీ
➣ BJP, BRS కలిసి కుట్ర చేస్తున్నాయి: CM రేవంత్
➣ మావోయిస్టులతో రాజకీయ నేతలు సంబంధాలు తెంచుకోవాలి: బండి సంజయ్
➣ JEE మెయిన్-2026 షెడ్యూల్ విడుదల
➣ ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో, ఉమెన్స్ WCలో ఇంగ్లండ్తో మ్యాచులో భారత్ ఓటమి
News October 20, 2025
ఇదేం ఆట.. టీమ్ ఇండియాపై ఫ్యాన్స్ ఫైర్

వరల్డ్ కప్-2025: ఇంగ్లండ్పై భారత మహిళల టీమ్ చేజేతులా మ్యాచ్ ఓడిపోయిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 30 బంతుల్లో 36 రన్స్ చేయాల్సి ఉండగా 6 వికెట్లు చేతిలో ఉన్నాయని, అయినా గెలవలేకపోయిందని మండిపడుతున్నారు. ఇలాంటి ఆటతీరుతో భారత్ WC నెగ్గడం కష్టమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా గత 3 మ్యాచుల్లో భారత్ పరాజయం పాలైంది. దీంతో సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. అటు AUS, దక్షిణాఫ్రికా, ENG సెమీస్ చేరాయి.