News June 20, 2024

భారత్-అఫ్గాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా మరికాసేపట్లో భారత్-అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. మ్యాచ్ జరిగే బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో వర్షం పడేందుకు 40 శాతం అవకాశాలు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్ జరిగే సమయంలో వాన కురిసే ఛాన్స్ ఉంది. కాగా టీమ్ ఇండియా ఒక మార్పుతో ఇవాళ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించనున్నట్లు సమాచారం.

Similar News

News March 31, 2026

స్పామ్ కాల్స్‌ను అడ్డుకోండిలా!

image

స్పామ్ కాల్స్‌, SMSలతో విసిగిపోయారా? వాటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ DND యాప్‌ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో మీ నంబర్‌ను రిజిస్టర్ చేసుకుంటే ఇలాంటి కాల్స్‌ను బ్లాక్ చేయవచ్చు. ఏయే ప్రమోషనల్ మెసేజ్‌లు రావాలో ఎంచుకోవచ్చు. స్పామ్ కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేసి, ట్రాక్ చేయొచ్చు. 2025లో ఇలాంటి 1,84,482 స్పామ్ కాల్స్‌ను ట్రాయ్ తొలగించింది. ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

News March 31, 2026

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర మరోసారి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,030 పెరిగి రూ.1,49,290గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 ఎగబాకి రూ.1,36,850 పలుకుతోంది. ఇక వెండి ధర కేజీపై రూ.5వేలు తగ్గి రూ.2,50,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుంటాయి

News March 31, 2026

హార్ముజ్‌పై బిల్లుకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం

image

హార్ముజ్ మీదుగా వెళ్లే నౌకలపై ఛార్జీలు విధించాలన్న ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్‌ నౌకలకు నిషేధం విధించిందని.. ఆంక్షలు విధించే ఇతర దేశాలకూ ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. అయితే ఎంత చెల్లించాలి? ఇండియా ఈ లిస్ట్‌లో ఉందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా భారత నౌకలకు ఇరాన్ ఎలాంటి ఛార్జ్ చేయట్లేదని కేంద్రం ఇటీవల పేర్కొంది.