News July 20, 2024
వర్షం.. తగ్గేదేలే!

AP, TGలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. HYDలో నిన్న రాత్రి మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. అక్కడ, ఇక్కడ అని లేకుండా అన్ని ప్రాంతాల్లో వాన పడుతోంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాగా వానలు రేపటి వరకు కొనసాగనున్నాయి.
Similar News
News February 4, 2026
మున్సిపల్ ప్రచారానికి సీఎం.. మిర్యాలగూడలో తొలి సభ

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో, రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, ఎల్లుండి నిజామాబాద్ జిల్లాలో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో, 9న మెదక్‌లో నిర్వహించే ఎన్నికల సభల్లో రేవంత్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
News February 4, 2026
ఇవాళ మేడారంలో తిరుగువారం పండుగ

TG: మేడారం, కన్నేపల్లి ఆలయాల్లో సమ్మక్క-సారలమ్మలకు ఇవాళ తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మహాజాతర ప్రారంభమైన వారం తర్వాత ఈ పండుగ జరుపుతారు. పూజారులు ఆలయాలను శుద్ధి చేసి, ధూపదీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరుగువారం పండుగ రోజున గిరిజన, గిరిజనేతర భక్తులు అమ్మవార్లను దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలు పూర్తికానున్నాయి.
News February 4, 2026
NCERTలో 117 ఉద్యోగాలు

NCERT 117 అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil అర్హతతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. అర్హులు FEB 20 వరకు అప్లై చేయొచ్చు. మరిన్ని వివరాలకు www.ncert.nic.in చూడండి.


