News April 11, 2025
బిహార్‌లో వర్ష బీభత్సం.. 80 మంది మృతి

అకాల వర్షాల కారణంగా బిహార్‌లో 80 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ తెలిపారు. అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలు, పిడుగుల వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. పంటలకు అపార నష్టం కలిగిందన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.4లక్షల చొప్పున పరిహారం అందించామన్నారు.
Similar News
News April 3, 2026
ఇంట్లోకి చొరబడి అత్యాచారం.. ప్రైవేట్ పార్టులో ఐరన్ రాడ్..!

AP: పల్నాడు (D) మాచర్లలో గురువారం ప్రభుత్వ ఉద్యోగిని(32)పై జరిగిన అత్యాచారం కేసులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె కాళ్లూచేతులు కట్టేసి, కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు HIV ఉందని బాధితురాలు చెప్పగా.. ఆమెను తీవ్రంగా కొట్టి, ప్రైవేట్ పార్టులో ఐరన్ రాడ్ చొప్పించినట్లు సమాచారం. స్థానికులు వెళ్లి చూడగా ఆమె వివస్త్రగా స్పృహ కోల్పోయి పడి ఉంది.
News April 3, 2026
ఇంట్లో కుండలోని నీటిని తాగుతున్నారా?

వేసవి తాపాన్ని తీర్చే మట్టి కుండ నీరు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ శుభ్రత పాటించకపోతే అదే అనారోగ్యానికి దారితీయవచ్చు. మట్టి కుండలో నీరు సురక్షితంగా ఉండేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. ‘కొత్త కుండను వాడే ముందు రోజంతా నీటిలో నానబెట్టాలి. రోజూ వేడి నీటితో కడగడం వల్ల బాక్టీరియా చేరదు. కుండను కడిగేందుకు సబ్బు వాడకండి. ఉప్పు లేదా బేకింగ్ సోడాతో మాత్రమే రుద్దడం మేలు’ అని సూచిస్తున్నారు.
News April 3, 2026
టీనేజర్ల ఫిజికల్ రిలేషన్.. కిడ్నాప్ కేసులో బాలుడికి ఊరట

15 ఏళ్ల బాలికతో ఫిజికల్ రిలేషన్ కారణంగా కిడ్నాప్ కేసు ఎదుర్కొంటున్న బాలుడికి ఉత్తరాఖండ్ హైకోర్టు ఉపశమనం కలిగించింది. అతనిపై జువెనైల్ జస్టిస్ బోర్డ్‌లో జరగాల్సిన విచారణను నిలిపివేసింది. తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని బాలుడిపై తండ్రి కేసు పెట్టారు. అయితే తానే అతడిని ఇంటికి ఆహ్వానించానని, పరస్పర అంగీకారంతోనే సంబంధం కొనసాగించామని బాలిక కోర్టుకు చెప్పింది. దీంతో బాలుడికి కోర్టు కేసు నుంచి ఊరటనిచ్చింది.


