News March 22, 2025

ఈ ఏడాది నైరుతిలో వర్షపాతం సాధారణమే

image

జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కురిసే నైరుతి వర్షపాతం వ్యవసాయానికి కీలకం. ఈ ఏడాది అది సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. నిరుడు డిసెంబరులో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి బలహీనమైన లానినా, ఈ ఏడాది మరింత బలహీనమవుతుందని వారు పేర్కొన్నారు. నైరుతి వచ్చేనాటికి ఎల్‌నినో వస్తుందని అంచనా వేశారు. పసిఫిక్, హిందూ మహాసముద్రాల మీదుగా చల్లగాలులు భారత్‌లోకి ప్రవేశించడం వల్ల నైరుతి వర్షాలు కురుస్తుంటాయి.

Similar News

News February 11, 2026

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉంటే పిల్లలు పుట్టరా?

image

ప్రస్తుతకాలంలో చిన్నవయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ చికిత్స వల్ల అండాశయాలు బలహీనమై పిల్లలు పుట్టడం కష్టమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్‌ చేయాలని సూచిస్తున్నారు. అండాశయ బాహ్యపొరలో ఉండే అపరిపక్వ అండాలను తీసి ఫ్రీజ్‌ అండ్‌ ప్రిజర్వ్‌ చేస్తారు. తర్వాత తిరిగి బాడీలో ఇంప్లాంట్ చేస్తే గర్భం దాల్చే అవకాశముంటుంది.

News February 11, 2026

సూపర్ ఓవర్: సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

image

టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ మధ్య సూపర్ ఓవర్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన AFG సూపర్ ఓవర్‌లో 17 రన్స్ చేసింది. సౌతాఫ్రికా టార్గెట్ 18 పరుగులు.

సూపర్ ఓవర్‌లో రన్స్ ఇలా.. 4, 6, 1, 1, 4, 1

News February 11, 2026

1pm వరకు 48.54% పోలింగ్

image

TG: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 51.66%, కార్పొరేషన్లలో 40.96% ఓటింగ్ నమోదైంది. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద జరిగే గొడవలపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవమని, నల్గొండ, కరీంనగర్‌లో జరిగినవి చిన్న గొడవలే అని తెలిపారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందన్నారు.