News June 14, 2024

RAINS: హైదరాబాద్‌‌‌లో ఇక మెట్రో ఆగదు!

image

వర్షాకాలంలో‌ మెట్రో‌ రైలు‌ సేవల్లో అంతరాయం లేకుండా‌ అధికారులు‌ చర్యలు తీసుకుంటున్నారు. గురువారం బేగంపేటలో‌ L & T HYD మెట్రో ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కంపెనీ కియోలిస్ తదితరులతో ఎండీ NVSరెడ్డి సమావేశమయ్యారు. ట్రాన్స్‌ కో ఫిడర్ ట్రిప్ అయితే ప్రత్యామ్నాయంగా మరొక ఫీడర్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. నీటి పైపులను క్లీన్ చేయడం, జాయింట్ల తనిఖీ, ఎస్కలేటర్ల వద్ద నీరు నిలువకుండా జాగ్రత్త‌ పడాలని సూచించారు.

Similar News

News September 13, 2024

గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్లపై నగర సీపీ సమీక్ష

image

HYD సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం సౌత్ ఈస్ట్ & ఈస్ట్ జోన్లలో పర్యటించారు. ఈనెల 17న జరగనున్న గణేశ్ నిమజ్జనం, 19న జరగనున్న మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్ల గురించి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులు మానసికంగా ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించి శాంతి భద్రతలు కాపాడాలని అన్నారు. అలాగే వేడుకల్లో భాగంగా ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం గురించి పలు సూచనలు చేశారు.

News September 13, 2024

HYD: రూ.2.94 కోట్ల బంగారం సీజ్..!

image

HYD నగర శివారు శంషాబాద్ ORR ఏరియాలో 3.98 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. దీని విలువ దాదాపుగా రూ.2.94 కోట్లు ఉంటుందని వెల్లడించారు. విదేశానికి చెందిన ఈ బంగారం.. కోల్‌కతా నుంచి తీసుకొస్తుండగా HYD నగరంలో పట్టుబడింది. కారు సీటు వెనక బ్రౌన్ టేపు వేసి, బంగారం దాచినట్లు అధికారులు తెలిపారు.

News September 13, 2024

HYD: దసరా, దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు

image

దసరా, దీపావళి, ఛాత్ పూజకు వెళ్లే ప్రయాణికులరద్దీని దృష్టిలో పెట్టుకుని 24 ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబరు 5 నుంచి నవంబరు 12 మధ్య ఒక్కో మార్గంలో ఆరేసి ట్రిప్పుల చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్, తిరుపతి-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-తిరుపతి మధ్య రైలు నడపనున్నట్లు తెలిపారు.