News August 2, 2024
రేపు ఏపీ వ్యాప్తంగా వర్షాలు

AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది.
Similar News
News December 9, 2025
శోకం నుంచి శక్తిగా.. సోనియా ప్రస్థానం!

నేడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు. భర్త రాజీవ్ గాంధీ మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టి పురుషుల ఆధిపత్యం ఉన్న రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పార్టీని అకుంఠిత దీక్షతో మళ్లీ అధికారంలోకి తెచ్చారు. పాలనలో తనదైన ముద్ర వేసి సుదీర్ఘకాలం దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. 2009లో ఇదే రోజున తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ ఆమె రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించారు.
News December 9, 2025
మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే!

అందంగా కనిపించాలని అమ్మాయిలు ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు. ఇలా కాకుండా కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే సహజంగానే మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. హెల్తీ ఫుడ్, తగినంత నిద్ర, మంచినీళ్లు తాగడం, సంతోషంగా ఉండటం వల్ల సహజంగా అందం పెరుగుతుందంటున్నారు. దీంతో పాటు బేసిక్ స్కిన్ కేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికోసం నాణ్యమైన మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ వాడాలని చెబుతున్నారు.
News December 9, 2025
ఫ్రాడ్ కాల్స్ వేధిస్తున్నాయా?

ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్, మెసేజ్లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ (<


