News August 4, 2024
రేపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

ఏపీలోని అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, VZM, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, YSR జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
Similar News
News October 18, 2025
బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.
News October 18, 2025
పిల్లల ప్రశ్నలను గౌరవించి రిప్లై ఇవ్వండి: వైద్యులు

పిల్లల సృజనాత్మకత పెరగాలంటే వారు ప్రశ్నలు అడగటాన్ని ప్రోత్సహించాలని మానసిక వైద్యుడు శ్రీకాంత్ సూచించారు. ‘ఐదేళ్ల లోపు చిన్నారులు రోజుకు సుమారు 300 ప్రశ్నలు అడుగుతారు. ఇది వారి అపారమైన ఉత్సుకతకు నిదర్శనం. తల్లిదండ్రులు వారి ప్రశ్నలకు ఓపిగ్గా జవాబివ్వడం, తెలియని వాటికి తెలుసుకొని చెప్తా అనడం చాలా ముఖ్యం. ప్రశ్నించడాన్ని అణచివేస్తే వారు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని కోల్పోవచ్చు’ అని హెచ్చరించారు.
News October 18, 2025
CCRHలో 31 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<