News March 29, 2025

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు

image

TG: ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 36-41 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.

Similar News

News April 1, 2025

ఆరుబయట పడుకుంటున్నారా?

image

వేసవి కారణంగా చాలామంది ఆరుబయటో, మేడపైనో పడుకుంటుంటారు. ఒకప్పుడైతే వేసవినాటికి దోమలు పోయేవి. కానీ నేడు విషజ్వరాలను కలిగించే దోమల సంతతి వేసవిలోనూ ఉంటోంది. ఈ నేపథ్యంలో బయట పడుకునేవారు కచ్చితంగా దోమల తెరను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే చోటుకు కొంచెం దూరంలో సాంబ్రాణి ధూపం వేస్తే ఆ వాసనకు దోమలు దూరంగా ఉంటాయంటున్నారు. కాళ్లకు చేతులకు నూనె రాసుకున్నా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

News April 1, 2025

స్కిన్ క్యాన్సర్‌తో బాధపడ్డా: జాన్ సీనా

image

WWE సూపర్‌స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గతంలో తాను స్కిన్ క్యాన్సర్‌ బారినపడ్డట్లు వెల్లడించారు. ‘ఒకసారి డెర్మటాలజిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు నా స్కిన్ కింది నుంచి క్యాన్సర్ కణుతులను తొలగించారు. WWE మ్యాచ్‌ల సందర్భంగా నా శరీరంపై మీరు ఆ స్పాట్స్‌ను చూడొచ్చు. మహమ్మారిపై పోరాడే సందర్భంలో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

News April 1, 2025

ALERT: ఎండలు, పిడుగులతో వానలు

image

AP: రాష్ట్రంలో రేపు 26, ఎల్లుండి 28 మండలాల్లో <>వడగాలులు వీస్తాయని<<>> APSDMA వెల్లడించింది. చాలా చోట్ల 39-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గురువారం రాయలసీమలో, శుక్రవారం ఉత్తరాంధ్రలో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని సూచించింది.

error: Content is protected !!