News September 23, 2025
ఈనెల 26 వరకు వర్షాలే వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గతంలో మాదిరి కాకుండా క్లౌడ్ బరస్ట్ తరహాలో వానలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాలు ఇప్పట్లో వీడే అవకాశం లేదని APSDMA తెలిపింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 26న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో AP, TGలో మరో 3(26 వరకు) రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News September 23, 2025
రబీ నుంచి ఆధార్‌పై ఎరువులు: అచ్చెన్నాయుడు

AP: వచ్చే రబీ సీజన్‌కు యూరియా సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రబీ నుంచి ఆధార్ కార్డు ఆధారంగా ఎరువులు సరఫరా చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఖరీఫ్ కోసం రాష్ట్ర అవసరాల మేరకు కేంద్రం నుంచి యూరియా తెప్పించామని, కొన్ని చోట్ల సరఫరాలో లోపాలు తలెత్తాయని, వాటిని సరిచేసుకొని ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 1.23 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.
News September 23, 2025
మైసూరులో ప్రారంభమైన దసరా ఉత్సవాలు

ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైసూరు దసరా(నాడా హబ్బ) ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గ్రహీత, రచయిత్రి భాను ముష్తాక్, కర్ణాటక CM సిద్దరామయ్యతో కలిసి ఉత్సవాలు ప్రారంభించారు. చాముండేశ్వరి ఆలయంలో పుష్పవృష్టితో మొదలైన ఈ 11 రోజుల పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు ఉంటాయి. అక్టోబర్ 2న జంబో సవారితో ముగిసే ఈ వేడుకలు కర్ణాటక రాజవంశ వారసత్వాన్ని, ప్రగతిని ప్రదర్శిస్తాయి.
News September 23, 2025
నేడు బ్రహ్మచారిణి అలంకారంలో భ్రమరాంబికాదేవి

ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల క్షేత్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న శైలపుత్రీ అమ్మవారిగా కొలువుదీరిన భ్రమరాంబికాదేవి నేడు సాయంత్రం బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు మయూర వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది. ఈ రూపంలో దర్శించి, పూజిస్తే దివ్య జ్ఞానం వస్తుందని, మరణ భయం ఉండదని పండితులు చెబుతారు. ఈ అలంకారంలో అమ్మవారు కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశంతో కనిపిస్తారు.