News May 18, 2024
వర్షాలు.. అవసరమైతే కాల్ చేయండి

TG: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్) సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లోతట్టు ప్రాంతాల్లోని నీటి నిల్వలను తొలగిస్తున్నారు. మరికొన్ని రోజులు వర్ష సూచన ఉండటంతో ప్రజల కోసం GHMC టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు ఫోన్ చేయాలని పేర్కొంది.
Similar News
News November 16, 2025
ముందే పంచాయతీ.. ఆ తర్వాతే పరిషత్ ఎన్నికలు?

TG: పరిషత్ ఎన్నికల కంటే ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 2 విడతలుగా ముందు MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కోర్టులో కేసు విచారణ ఉండటం, అటు 15 ఫైనాన్స్ నిధులు ఆగిపోవడంతో ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.
News November 16, 2025
Infosys ఉద్యోగులకు 75% బోనస్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్త చెప్పింది. SEP త్రైమాసికానికి సగటున 75% బోనస్ ప్రకటించింది. ఔట్స్టాండింగ్ పనితీరు కనబర్చిన వారికి 83%, ఉత్తమ పనితీరు ప్రదర్శించిన వారికి 78.5%, అంచనాలు అందుకున్నవారికి 75% లభించనుంది. గతంలో కంటే 7-8% తగ్గినప్పటికీ అన్ని కేటగిరీల్లో సగటున 70.5%-83% అందనుంది. లెవల్ 4, 5, 6లోని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లు, సీనియర్ మేనేజర్లకు ఈ బోనస్ లభిస్తుంది.
News November 16, 2025
ఇండియా-A ఘన విజయం

రాజ్కోట్ వేదికగా సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికార వన్డేలో ఇండియా-A 9 వికెట్ల తేడాతో గెలిచింది. 133 పరుగుల లక్ష్యాన్ని 28 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో రుతురాజ్ (68*) హాఫ్ సెంచరీతో రాణించగా అభిషేక్ 32, తిలక్ 29* రన్స్ చేశారు. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్ను ఇండియా-A 2-0తో సొంతం చేసుకుంది. మూడో అనధికార వన్డే ఈ నెల 19న రాజ్కోట్లో జరగనుంది.


