News June 16, 2024

రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వెల్లడించింది.

Similar News

News March 26, 2026

వివాదాస్పద పాట.. అర్థం తెలియదన్న డైరెక్టర్

image

పాన్ ఇండియా సినిమా ‘KD: ది డెవిల్’లోని <<19406830>>వివాదాస్పద<<>> పాటపై డైరెక్టర్ ప్రేమ్ స్పందించారు. హిందీపై తనకు పట్టులేదని, ఆ పాట లిరిక్స్ అర్థం తెలియదని చెప్పారు. ఇదొక ఎమోషనల్ మూవీ అని, కేవలం ఫన్ కోసమే ఆ పాటను పెట్టామన్నారు. ఇదే సాంగ్‌కు కేరళం, కర్ణాటకలో ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం, గ్యాస్ కొరత లాంటి ముఖ్యమైన విషయాలపై చర్చించాలి గానీ ఇలాంటి వాటిపై కాదని పేర్కొన్నారు.

News March 26, 2026

67,583 ఉద్యోగాలు భర్తీ చేశాం: డిప్యూటీ సీఎం భట్టి

image

TG: రాష్ట్రంలో ఇప్పటివరకు 67,583 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని 31,798 పోస్టులకు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. తమ హయాంలో 16,798 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టామని.. ఇక గత ప్రభుత్వ హయాంలో నోటిఫై అయ్యి పెండింగ్‌ ఉన్న 50,785 పోస్టింగ్స్ కూడా పూర్తి చేశామన్నారు. నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు.

News March 26, 2026

ముంబై ఇండియన్స్.. ప్లేయింగ్-11 ఇదేనా?

image

IPL-2026లో ముంబై స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. రోహిత్, సూర్య, పాండ్య లాంటి స్టార్లు ఆ జట్టు సొంతం. బుమ్రా, బౌల్ట్‌లతో పేస్ దళం కూడా బలంగానే ఉంది. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది.
ప్లేయింగ్ 11 అంచనా: రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (C), నమన్ ధీర్, రూథర్‌ఫర్డ్, శాంట్నర్, శార్దుల్/దీపక్ చాహర్, బుమ్రా, అశ్వని/మయాంక్ మార్కండే, బౌల్ట్.