News May 11, 2024
వారం రోజులు వర్షాలు

తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నెల 15 వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నేడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని తెలిపారు.
Similar News
News January 14, 2026
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ&రేటింగ్

డబ్బు కోసం జమిందారీ అమ్మాయితో పెళ్లి, ప్రెసిడెంట్ కావడం, ఆ తర్వాత హీరోకు ఎదురయ్యే అనుభవాలే స్టోరీలైన్. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్, వన్ లైన్ పంచ్లతో మరోసారి అలరించారు. హీరోయిన్ మీనాక్షి నటన, అందంతో ఆకట్టుకున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. పాత స్టోరీ లైన్, యావరేజ్ మ్యూజిక్ మైనస్. సెకండాఫ్లో వచ్చే పొలిటికల్ డ్రామా ల్యాగ్ అన్పిస్తుంది. ఓవరాల్గా కామెడీ ట్రావెల్.
రేటింగ్: 2.75/5.
News January 14, 2026
CEERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 14, 2026
విమానాలకు ‘పొగ’బెట్టిన భోగి

చెన్నైలో భోగి పండుగ విమాన రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. పొగమంచుకు తోడు భోగి మంటలతో వచ్చిన పొగతో పూర్ విజిబిలిటీ ఏర్పడింది. దీంతో చెన్నై ఎయిర్పోర్టులో విమానాలు ల్యాండ్ కాలేకపోతున్నాయి. వాటిని డైవర్ట్ చేస్తున్నారు. అయితే సమయం గడిచేకొద్దీ విజిబిలిటీ పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ప్రజలు ప్లాస్టిక్, రబ్బర్ టైర్లు కాల్చకుండా స్మోక్ ఫ్రీ సెలబ్రేషన్స్ చేసుకోవాలని TNPCB కోరింది.


