News December 9, 2024

రేపటి నుంచి వర్షాలు.. 17న మరో ముప్పు

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 11నాటికి నైరుతి బంగాళాఖాతానికి చేరుకొని TN-శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపటి నుంచి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయంది. ఈ నెల 17న అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.

Similar News

News December 5, 2025

భగవంతుడిపై నమ్మకం ఎందుకు ఉంచాలి?

image

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||
దేవుడు మనలోనే అంతరాత్మగా ఉంటాడు. ధనుస్సు ధరించి పరాక్రమంతో ధైర్యాన్నిస్తాడు. ప్రజ్ఞావంతుడు, ఉన్నత క్రమశిక్షణ గల ఆయన అన్ని విషయాలకు అతీతంగా ఉంటాడు. ఎవరూ భయపెట్టలేని విశ్వాసపాత్రుడు మన కార్యాలను నెరవేరుస్తూ, సకల ఆత్మలకు మూలమై ఉంటాడు. మనం ఆ పరమాత్మను గుర్తించి, విశ్వాసం ఉంచి ధైర్యంగా జీవించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 5, 2025

225 అప్రెంటిస్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

పాటియాలా లోకోమోటివ్ వర్క్స్ 225 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు. అప్రెంటిస్‌ల గరిష్ఠ వయసు 24ఏళ్లు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా www.apprenticeshipindia.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్: https://plw.indianrailways.gov.in

News December 5, 2025

ప్రభుత్వ గుత్తాధిపత్య మోడల్ వల్లే ఈ దుస్థితి: రాహుల్

image

ఇండిగో విమాన సర్వీసులు రద్దవుతుండటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘ప్రభుత్వ గుత్తాధిపత్య నమూనాకు మూల్యమే ఇండిగో వైఫల్యం. సర్వీసుల ఆలస్యం, రద్దు వల్ల సాధారణ ప్రజలు మరోసారి ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ప్రతి రంగంలోనూ నాణ్యమైన పోటీ ఉండాలి. మ్యాచ్ ఫిక్సింగ్ గుత్తాధిపత్యాలు కాదు’ అని ట్వీట్ చేశారు. ఏడాది కిందట తాను రాసిన వ్యాసాన్ని షేర్ చేశారు.