News April 1, 2025
ఏపీలో 3, 4 తేదీల్లో వర్షాలు

AP: రాష్ట్రంలో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. 3న రాయలసీమ, 4న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. మరోవైపు, నిన్న రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడులో 40.3°C ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News April 2, 2025
ఎకరానికి రూ.31,000: మంత్రి ప్రకటన

AP: రిలయన్స్ <<15966046>>CBG ప్లాంట్లతో<<>> ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. గుజరాత్ కంటే ఏపీలోనే రిలయన్స్ ఎక్కువగా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందన్నారు. వీటి ద్వారా బంజరు భూములు వినియోగంలోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూములకు రూ.31వేలు కౌలు చెల్లిస్తామన్నారు. కందుకూరులో ఇండోసోల్ ప్లాంట్, BPCL అందుబాటులోకి రానున్నాయన్నారు.
News April 2, 2025
ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

TG: రాష్ట్రవ్యాప్తంగా 45,548 మంది ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో ప్రత్యేక సబ్సిడీ డబ్బులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇందుకోసం మొత్తం ₹72crను విడుదల చేశామన్నారు. సబ్సిడీ కింద ప్రభుత్వం ఎకరాకు ₹50వేలకు పైగా అందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2.34 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతోంది. 2023లో మార్చిలో టన్ను గెల ధర ₹14,174గా ఉండగా, ప్రస్తుతం ₹21,000కు చేరిందని మంత్రి తెలిపారు.
News April 2, 2025
ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంపు

TG: ఎల్ఆర్ఎస్ ఫీజును 25% రాయితీతో చెల్లించేందుకు ఇచ్చిన గడువును ప్రభుత్వం పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.