News August 20, 2024

నేడు పలు జిల్లాల్లో వర్షాలు

image

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా.. విశాఖ, ప.గో, క‌ృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Similar News

News October 20, 2025

దీపావళి: ఈ నియమాలు పాటిస్తున్నారా?

image

దీపావళి రోజున చేసే లక్ష్మీదేవి పూజలో ఇనుప వస్తువులు వాడకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది నెగటివ్ శక్తిని పెంచుతుందని అంటున్నారు. ‘నేడు ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు, మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. ఇంట్లో ఆడవారిని ఎట్టి పరిస్థితుల్లో బాధపెట్టకూడదు. ఈ రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఇంట్లో బూజు దులపకూడదు. తులసి ఆకులు కోయకూడదు. ఇలా ఇస్తే.. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్తుంది’ అని చెబుతున్నారు.

News October 20, 2025

తిరుమలలో భక్తుల రద్దీ.. ఆర్జిత సేవలు రద్దు

image

AP: దీపావళి పండుగ వేళ తిరుమలలో రద్దీ నెలకొంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల వరకు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 84,017 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.97 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఇవాళ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు.

News October 20, 2025

NIT సూరత్‌లో 23 పోస్టులు

image

సర్దార్ వల్లభాయ్ NIT, సూరత్(SVNIT) 23 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో Jr, Sr అసిస్టెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, స్పోర్ట్స్ ఆఫీసర్, Asst లైబ్రేరియన్, సూపరింటెండెంట్, Jr ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలుగల వారు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని NOV 21లోగా స్పీడ్ పోస్టు ద్వారా పంపించాలి. వెబ్‌సైట్: https://www.svnit.ac.in