News May 20, 2024
తెలంగాణలో రానున్న 3 రోజుల్లో వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం వల్ల తెలంగాణలో రానున్న 3రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 22 నాటికి అల్ప పీడనం ఏర్పడి, రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
Similar News
News December 24, 2024
NHRC ఛైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్
జాతీయ మానవహక్కుల కమిషన్(NHRC) ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఐదేళ్లపాటు లేదా వయసు 70ఏళ్ల వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. మద్రాస్ లా కాలేజీలో చదివిన ఈయన 1983 నుంచి 23 ఏళ్ల పాటు లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత మద్రాస్, ఉమ్మడి AP హైకోర్టు న్యాయమూర్తి, హిమాచల్ ప్రదేశ్ CJగా బాధ్యతలు నిర్వహించారు. 2019-23 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు.
News December 24, 2024
English Learning: Antonyms
✒ Cheap× Dear, unreasonable
✒ Coarse× Fine, Chaste
✒ Classic× Romantic, Unusual
✒ Compact× Loose, Diffuse
✒ Comic× Tragic, tragedian
✒ Conceit× Modesty
✒ Compress× Amplify, Expand
✒ Condemn× Approve, Praise
✒ Concord× Discord
News December 24, 2024
భారత్‌కు పాత్ పిచ్‌లు, ఆసీస్‌కు కొత్తవి.. క్యూరేటర్ ఏమన్నారంటే?
బాక్సింగ్ డే టెస్టుకు IND-AUS సిద్ధమవుతున్న వేళ ఓ వివాదం తెరమీదకు వచ్చింది. MCGలో భారత ప్లేయర్ల ప్రాక్టీస్ కోసం పాత పిచ్‌లు, ఆసీస్ కోసం కొత్త అందుబాటులో ఉంచినట్లు ఫొటోలు వైరలవుతున్నాయి. పాత పిచ్ కారణంగా ప్లేయర్లకు గాయాలైనట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై క్యూరేటర్ స్పందిస్తూ ‘మ్యాచ్‌కు 3 రోజుల ముందే కొత్త పిచ్ సిద్ధమవుతుంది. IND ప్రాక్టీస్ షెడ్యూల్ చాలా ముందుగా వచ్చింది’ అని పేర్కొన్నాడు.