News October 13, 2025

రేపు ఉదయం లోగా పలు జిల్లాల్లో వర్షాలు!

image

TG: రాష్ట్రంలో రేపు ఉదయం 8.30గంటల లోపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Similar News

News October 13, 2025

వేణు ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ నుంచి నితిన్ ఔట్?

image

బలగం మూవీతో డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు తర్వాత ‘ఎల్లమ్మ’ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఇంకా హీరో ఫైనల్ కాలేదని తెలుస్తోంది. మొదట నితిన్ పేరు వినిపించింది. నిర్మాత దిల్ రాజు కూడా ఆ విషయాన్ని కన్ఫామ్ చేశారు. కానీ, ఇప్పుడు నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ కథను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు వినిపించగా ఓకే చేశారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

News October 13, 2025

చైనాను బాధ పెట్టాలి అనుకోవట్లేదు: ట్రంప్

image

చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనంగా 100% టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే. అయితే తాను చైనాను బాధ పెట్టాలి అనుకోవట్లేదని పేర్కొన్నారు. ‘చైనా గురించి ఆందోళన వద్దు ఆ దేశం బాగానే ఉంటుంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ కాస్త గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన గానీ, నేను గానీ చైనాకు ఇబ్బందులు రావాలి అనుకోవట్లేదు. US చైనాకు సాయం చేయాలనుకుంటోది. దానిని బాధించాలని కాదు’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

News October 13, 2025

అక్టోబర్ 13: చరిత్రలో ఈ రోజు

image

1965: హాస్య నటి కల్పనా రంజనీ జననం
1973: కవి, గీత రచయిత కందికొండ యాదగిరి జననం
1987: బాలీవుడ్ నటుడు కిషోర్ కుమార్ మరణం
1990: హీరోయిన్ పూజా హెగ్డే(ఫొటోలో) జననం
1993: టీమ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారి జననం
*ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం