News December 8, 2024
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురిసింది. TGలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 10 నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ తదితర జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి.
Similar News
News December 3, 2025
నేడు రెండు జిల్లాల్లో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. 10.55AMకు తూ.గో. జిల్లా నల్లజర్లలో జరగనున్న ‘రైతన్నా.. మీ కోసం’ వర్క్ షాప్లో ఆయన పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక సభలో రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 1.45PM నుంచి 3.15PM వరకు కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. 6PMకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకొని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.
News December 3, 2025
రేపే దత్త జయంతి.. ఏం చేయాలంటే?

త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయస్వామి. అందుకే ఆయనకు 3 తలలుంటాయి. రేపు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయనను పూజిస్తే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆరాధనా ఫలితం దక్కుతుందని నమ్మకం. ఆయన చిత్రపటం, విగ్రహానికి పసుపు రంగు పూలతో అలంకరించి, పులిహోరా, నిమ్మకాయలు వంటి పసుపు రంగు నైవేద్యాలు సమర్పిస్తే.. శని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున ఆయన అనుగ్రహం పొందితే జీవితంలో శుభాలు కలుగుతాయి.
News December 3, 2025
భారత్ సిరీస్ పట్టేస్తుందా?

IND, SA మధ్య నేడు రాయ్పూర్లో రెండో వన్డే జరగనుంది. 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఇవాళ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు సిరీస్ ఫలితాన్ని 3వ వన్డేకు వాయిదా వేయాలనే పట్టుదలతో సఫారీ జట్టు ఉంది. గాయంతో తొలి వన్డేకు దూరమైన బవుమా జట్టులో చేరే ఆస్కారం ఉంది. రోహిత్, కోహ్లీ ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం. సుందర్ ప్లేస్లో తిలక్ జట్టులోకి రావొచ్చని టాక్. మ్యాచ్ 1.30PMకు మొదలవుతుంది.


