News May 9, 2024
నేడూ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. అలాగే ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News January 7, 2025
20 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు: సీఎం చంద్రబాబు
AP: రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ‘కుప్పంను టూరిజం హబ్ చేయనున్నాం. ఇక్కడి నుంచి బెంగళూరుకు గంటలో వెళ్లేలా రోడ్డును నిర్మిస్తాం. చిత్తూరు జిల్లాలో అన్ని ఆస్పత్రుల్ని అనుసంధానం చేసేలా టాటా కంపెనీతో ఓ ప్రాజెక్టును రూపొందిస్తున్నాం’ అని వెల్లడించారు.
News January 7, 2025
మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా: KTR
TG: లాయర్ల సమక్షంలోనే తన విచారణ జరగాలని హైకోర్టును ఆశ్రయించనున్నట్లు KTR వెల్లడించారు. తనకు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరుతానన్నారు. విచారణకు లాయర్లతో రావొద్దని చెబుతున్నారని, ఇలానే వెళ్లిన తమ పార్టీ నేత పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు బుకాయించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసులు పెట్టారని, సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.
News January 7, 2025
తొలి హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు
TG: చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా తొలి పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. బుద్ధ భవన్‌లోని బి-బ్లాక్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కార్యకలాపాలన్నీ ఈ స్టేషన్ ద్వారా నిర్వహిస్తారు. ఏసీపీ స్థాయి అధికారి నిర్వహణను చూస్తారు. దీనికి తగిన సిబ్బందిని కేటాయించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, నాలాల ఆక్రమణలపై ప్రజలకున్న ఫిర్యాదుల్ని ఈ స్టేషన్లో స్వీకరిస్తారు.