News January 11, 2025
రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలతో పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, అన్నమయ్య తదితర జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఆదివారం భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.
Similar News
News December 20, 2025
కొండంత లక్ష్యం.. ఎదురొడ్డుతున్న ఇంగ్లండ్

యాషెస్ మూడో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. కొండంత లక్ష్యంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు ఆదిలోనే ఓపెనర్ డకెట్(4) వికెట్ కోల్పోయింది. తర్వాత పోప్(17) కూడా ఔట్ అయ్యారు. దీంతో ఆ జట్టు 49 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో క్రాలే, రూట్ ఉన్నారు. ఆట ఇవాళ, రేపు మిగిలి ఉండగా ENG టార్గెట్ను ఛేదించడం గగనమే.
News December 20, 2025
ప్రియుడితో గదిలో యువతి.. తండ్రి రావడంతో..

TG: సంగారెడ్డి(D) కొల్లూరులో విషాదం చోటు చేసుకుంది. HYD పాతబస్తీకి చెందిన వ్యక్తికి కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరవగా ఖాళీగా ఉంటోంది. నిన్న ఆయన కూతురు(20), ప్రియుడితో కలిసి అక్కడి ఇంటికి వెళ్లింది. అదే సమయంలో ఆమె తండ్రి కూడా అక్కడికి వచ్చారు. దీంతో తీవ్రంగా భయపడ్డ ప్రేమ జంట బాల్కనీ నుంచి పక్క ఫ్లాట్కి వెళ్లాలని ప్రయత్నించింది. యువతి కాలు జారి 8వ అంతస్తు నుంచి పడి మరణించింది.
News December 20, 2025
PCOSలో ఎన్ని రకాలున్నాయో తెలుసా?

ప్రస్తుతకాలంలో చాలామందిలో PCOS సమస్య కనిపిస్తోంది. అయితే ఇందులో A, B, C, D అని 4 రకాలున్నాయంటున్నారు నిపుణులు. A రకంలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, అండం విడుదల కాకపోవటం, అండాశయాల్లో తిత్తులు ఉంటాయి. Bలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, నెలసరి అస్తవ్యస్తమవటం ఉంటాయి. Cలో- మగ హార్మోన్లు, తిత్తులూ ఉంటాయి. కానీ నెలసరి అవుతుంది. Dలో నెలసరి రాకపోవడం , తిత్తులు ఉన్నప్పటికీ మగ హార్మోన్లు ఎక్కువగా ఉండవు.


