News March 22, 2025
రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు రాయలసీమలో, కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు నిన్న రాష్ట్రంలో ఎండలు మండిపోయాయి. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కర్నూలు జిల్లా కోసిగిలో 40.6 డిగ్రీలు నమోదయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 మండలాల్లో వడగాలులు వీచాయి.
Similar News
News March 22, 2025
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు

కేంద్ర ప్రభుత్వం 2025కు గాను జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించింది. ప్రఖ్యాత హిందీ రచయిత, కవి వినోద్ కుమార్ శుక్లా రచించిన ‘నౌకర్ కీ కమీజ్’ నవలను ఇందుకు ఎంపిక చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆయన 50 ఏళ్లుగా సాహిత్య సేవ చేస్తున్నారు.
News March 22, 2025
చరణ్ బర్త్ డే.. ‘నాయక్’ రీరిలీజ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘నాయక్’ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా ‘నాయక్’ రీరిలీజ్‌పై అభిమానుల నుంచి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చరణ్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ తెరకెక్కించారు. ఈ చిత్రం 2013లో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కాగా, ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు.
News March 22, 2025
విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం

AP: విశాఖ మేయర్ వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలుగా కూటమి నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో YCPకి షాక్ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. GVMCలో 98 స్థానాలుండగా, YCP 59 చోట్ల గెలిచింది. ఈ 9 నెలల్లో 28 మంది కూటమి పార్టీల్లో చేరడంతో YCP బలం పడిపోయింది. మేయర్‌కు నాలుగేళ్ల పదవీకాలం పూర్తవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానానికి మార్గం సుగమమైంది.