News August 9, 2025
రానున్న రెండు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉ.10 గంటల లోపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నారాయణపేట్, సూర్యాపేట్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో వానలు పడొచ్చని పేర్కొంది. అటు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Similar News
News August 9, 2025
ప్రభాస్ ‘రాజాసాబ్’ నిర్మాతకు వార్నింగ్

ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు సినీ కార్మికులు వార్నింగ్ ఇచ్చారు. జీతాలు పెంచమని అడిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు తిరగబడితే తట్టుకోలేరని, వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆయన ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమ్మె తర్వాత కూడా విశ్వప్రసాద్ సినిమాలకు పనిచేయబోమన్నారు. ఆయన అసలు భారతీయుడే కాదని, ఇంగ్లిష్ కల్చర్‌ను తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు.
News August 9, 2025
‘సృష్టి’ కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్

AP: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ సోదరుడు, విశాఖ KGH అనస్థీషియా హెడ్ డాక్టర్ రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరు వైద్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ నమ్రత అక్రమ కార్యకలాపాల్లో వీరు పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టుల సంఖ్య 30కి చేరింది.
News August 9, 2025
కలాం 1200 మోటార్ ఫస్ట్ స్టాటిక్ టెస్ట్ సక్సెస్: ISRO

HYD సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తోన్న విక్రమ్-1 లాంచ్ వెహికల్‌కు సంబంధించి తొలి దశ పూర్తయింది. షార్ సెంటర్‌లో కలాం 1200 మోటార్ ఫస్ట్ స్టాటిక్ టెస్ట్ సక్సెస్ అయినట్లు ISRO ప్రకటించింది. ఈ మోటార్ 11m పొడవు, 1.7m డయా మోనోలిథిక్ కాంపోజిట్ మోటారు, 30 టన్నుల ప్రొపెల్లెంట్ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. స్పేస్ పాలసీలో భాగంగా ఇలాంటి ప్రాజెక్టుల్లో ప్రైవేట్ సంస్థలకు ISRO మార్గనిర్దేశం చేస్తోంది.