News August 22, 2024
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో గంటలో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, హన్మకొండలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మీ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయా? కామెంట్ చేయండి.
Similar News
News November 18, 2025
ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.
News November 18, 2025
వి‘పత్తి’.. తగ్గిన దిగుబడి, పెరగని రేటు!

APలో ఇటీవల తుఫానుతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. దిగుబడి తగ్గడంతోపాటు నాణ్యతా లోపించింది. దీంతో మద్దతు ధర అందడం లేదు. MSP ₹7,710-8,110 ఉండగా, ₹7వేల లోపే ధర పలుకుతోంది. CCI కేంద్రాల్లో తేమ పరీక్షతో ధర తగ్గించడం, శ్లాబుల వల్ల ఎదురుచూడలేక ప్రైవేటు వ్యాపారులకు రైతులు అమ్ముతున్నారు. పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని వాపోతున్నారు. అటు తెలంగాణలో జిన్నింగ్ మిల్లుల సమ్మెతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి.