News July 9, 2024
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ జనగాం, KNR, ఖమ్మం, MBNR, ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, NZMB, రాజన్నసిరిసిల్ల, సూర్యాపేట, WGL జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. నిన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షం కురిసింది.
Similar News
News December 6, 2025
ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: సూర్యాపేట కలెక్టర్

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఆయన వెబ్ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, మెటీరియల్ పంపిణీ, కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వివరాలను 37ఏ, 37సీ రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.
News December 6, 2025
గవర్నర్తో సీఎం చంద్రబాబు భేటీ

AP: విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తోన్న కృషిని CM వివరించినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణ పనుల పురోగతిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
News December 6, 2025
హిట్ మ్యాన్@ 20,000 రన్స్

SAతో మూడో వన్డేలో రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్(టెస్టు, వన్డే, T20)లో 20,000 పరుగులు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్గా నిలిచారు. కేశవ్ వేసిన 14 ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనత సాధించారు. సచిన్(34,357), కోహ్లీ(27,910), ద్రవిడ్(24,064) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా ప్రస్తుత మ్యాచ్లో భారత్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో జైస్వాల్(38), రోహిత్(50) ఉన్నారు.


