News July 7, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో వర్షం కురవనున్నట్లు AP విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Similar News

News January 18, 2026

బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇక రూ.30 లక్షల పరిహారం!

image

RBI కొత్త ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌ను ప్రకటించింది. దీని ప్రకారం బ్యాంకింగ్ సేవల్లో లోపాల వల్ల కస్టమర్లకు కలిగే నష్టానికి ఇచ్చే పరిహారాన్ని ₹20లక్షల నుంచి ₹30లక్షలకు పెంచింది. మానసిక వేదన, టైమ్ వేస్ట్ అయినందుకు ఇచ్చే పరిహారాన్నీ ₹లక్ష నుంచి ₹3 లక్షలు చేసింది. జులై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ రూల్స్ అన్ని బ్యాంకులు, NBFCలకు వర్తిస్తాయి. కస్టమర్లు ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో పరిష్కరించుకోవచ్చు.

News January 18, 2026

నకిలీ మద్యం మరణాలకు CBN బాధ్యత వహిస్తారా: వైసీపీ

image

AP: నకిలీ మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మరణించారంటూ ప్రభుత్వంపై YCP మండిపడింది. వీరి చావులకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకుంటారా అని ‘ఎక్స్’లో ప్రశ్నించింది. అన్నమయ్య జిల్లాలో నిన్న సాయంత్రం ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించిన మణికుమార్, పుష్పరాజ్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించారని విమర్శించింది. ఎక్స్‌పైర్, నకిలీ మద్యం అమ్ముతూ TDP లిక్కర్ సిండికేట్ సొమ్ము చేసుకుంటోందని వైసీపీ ఆరోపించింది.

News January 18, 2026

పుష్ప-3 ఉంటుందా? ఉత్తి హైపేనా?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ వేర్వేరు సినిమాలతో బిజీ అయ్యారు. దీంతో పుష్ప-3 ఉంటుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. కేవలం హైపేనా? అంటూ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ సుకుమార్ టీమ్ వాటిని కొట్టిపారేసింది. మూవీ కచ్చితంగా ఉంటుందని చెప్పింది. డైరెక్టర్, హీరో ఇతర ప్రాజెక్టుల్లో బిజీ అయినా.. టైమ్ దొరికినప్పుడల్లా కథ, స్క్రిప్ట్‌పైన వర్క్ చేస్తున్నట్లు చెప్పింది.