News October 19, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. TGలోనూ పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది.
Similar News
News February 3, 2026
నేడు ఏపీ కేబినెట్ భేటీ

AP: రాష్ట్ర కేబినెట్ భేటీ ఈరోజు జరగనుంది. ఉదయం 10:30 గంటలకు అమరావతి సచివాలయం ఫస్ట్ బ్లాక్లో మంత్రులు భేటీ కానున్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతోపాటు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. FEB 11వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. 14వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో పెడతారు.
News February 3, 2026
ఉప్పు వేయడం, వేర్లు నరకడం వల్ల కొబ్బరి దిగుబడి పెరుగుతుందా?

చాలా చోట్ల కొబ్బరి సాగు చేస్తున్న రైతులు చెట్లకు ఉప్పు వేయడం, వేర్లు నరకడం చేస్తుంటారు. దీని వల్ల దిగుబడి పెరుగుతుందని కొందరు చెబుతుంటారు. ఏడాది వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఏడాది దిగుబడి కొంత పెరగడం కనిపిస్తుంది. కానీ తర్వాత ఏడాది నుంచి దిగుబడి తగ్గిపోతుంది. అది చెట్టుకు కూడా హాని చేస్తుంది. ఇది అశాస్త్రీయమైన పద్ధతి అని, దీన్ని పాటించకపోవడం మంచిదని ఉద్యాన పరిశోధనా నిపుణులు చెబుతున్నారు.
News February 3, 2026
అడుగులోనే అరక విరిగిందట

పొలం దున్నడానికి ఉపయోగించే ముఖ్యమైన వ్యవసాయ పనిముట్టు అరక. పొలం దున్నడం మొదలుపెట్టి, ఒక అడుగు వేయకముందే లేదా మొదటి అడుగులోనే, ప్రధానమైన పనిముట్టు అయిన అరక విరిగిపోతే పని ముందుకు సాగదు. ఏదైనా ఒక కార్యాన్ని లేదా ప్రయత్నాన్ని ప్రారంభించిన తక్షణమే ఊహించని సమస్య లేదా అవాంతరం ఎదురై మొత్తం ప్రణాళిక లేదా ప్రయత్నం విఫలమైనప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు.


