News November 15, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలోనే రేపు కూడా ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని APSDM తెలిపింది.

Similar News

News February 2, 2026

తగ్గనున్న చలి.. పెరగనున్న ఎండ తీవ్రత

image

ఈ నెల నుంచి దేశంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల చలి తీవ్రత క్రమంగా తగ్గనుంది. అలాగే ఎండ తీవ్రత కూడా పెరుగుతుందని పేర్కొంది. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా.. కేరళ, మధ్య భారతం మినహా మిగిలిన చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సగటుకు మించి నమోదవుతున్నాయి.

News February 2, 2026

పిండి దీపం వెలిగిస్తున్నారా?

image

పిండి దీపం వెలిగిస్తే పనుల్లో ఆటంకాలు తొలగి, సకల కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ దీపారాధనతో గ్రహ దోషాలు, ఆర్థికారోగ్య సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శనివారం రోజు ఈ దీపం వెలిగించడం వల్ల శ్రీనివాసుని అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నారాయణుడి మంత్రోచ్చారణలతో 7 వారాల పాటు ఇలా చేయాలని సూచిస్తున్నారు. పిండి దీపం ఎలా తయారుచేయాలి, ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.

News February 2, 2026

పిగ్మెంటేషన్ రకాలు

image

పిగ్మెంటేషన్‌లో 2 రకాలున్నాయి. మొదటిది హైపర్-పిగ్మెంటేషన్. ఇందులో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వలన చర్మంపై ముదురు రంగు మచ్చలు, మెలస్మా, నల్ల మచ్చలు ఏర్పడతాయి. 2వది హైపో-పిగ్మెంటేషన్. ఇందులో మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వలన చర్మంపై లేత రంగు మచ్చలు లేదా బొల్లి – విటిలిగో ఏర్పడతాయి. వయస్సు, హార్మోన్ల మార్పులు, సూర్యరశ్మి, కొన్ని రకాల మందులు, జన్యుపరమైన అంశాలు ఈ సమస్యకు కారణం కావచ్చు.