News November 16, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. అలాగే అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Similar News

News November 16, 2024

గుడ్ న్యూస్.. ఫీజు చెల్లించేందుకు గడువు పెంపు

image

TG: పదవ తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ గడువు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఎల్లుండితో గడువు ముగియనుండగా ఈ నెల 28 వరకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. చలానా విధానాన్ని రద్దు చేస్తూ, పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యాన్ని తీసుకొచ్చింది.

News November 16, 2024

నీటిని పీల్చుకునే ‘ట్రోవాంట్స్’ రాళ్లు!

image

యూరప్‌లోని రొమేనియాలో ఉన్న వింత రాళ్లు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘ట్రోవాంట్స్’ అని పిలిచే ఈ ప్రత్యేకమైన రాళ్లు వర్షాలు పడిన తర్వాత వాటంతటవే పెరిగిపోతుంటాయి. అప్పటివరకూ సాధారణ శిలల్లా కనిపించే ఈ భౌగోళిక అద్భుతాలు వర్షపు నీటిని పీల్చుకుని పరిమాణాన్ని పెంచుకుంటాయి. అచ్చం జీవిలానే ప్రవర్తిస్తాయి. ఈ దృగ్విషయం స్థానికులు, శాస్త్రవేత్తలు సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.

News November 16, 2024

ట్రంప్‌ను చంపే ఆలోచ‌న లేదు: ఇరాన్‌

image

ట్రంప్‌ను హ‌త్య చేసే ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని అమెరికాకు ఇరాన్ వివరణ ఇచ్చింది. Sepలో ఇరాన్‌తో జో బైడెన్ యంత్రాంగం సమావేశమైంది. ట్రంప్‌పై ఏర‌క‌మైన దాడి జ‌రిగినా దాన్ని యుద్ధ చ‌ర్య‌గా ప‌ర‌గ‌ణిస్తామ‌ని US స్ప‌ష్టం చేసింది. దీంతో Octలో ఇరాన్ ‘ఆ ఆలోచన లేద’ని బ‌దులిచ్చిన‌ట్టు సమాచారం. 2020లో ట్రంప్ ఆదేశానుసారం జ‌రిగిన దాడిలో ఇరాన్ మిలిట‌రీ క‌మాండ‌ర్ ఖాసీం సులేమాని హ‌త‌మ‌వ్వడంతో ఇద్దరి మధ్య రగడ ప్రారంభమైంది.