News December 3, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రేపు రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Similar News
News January 22, 2026
అప్పుడు అలాస్కా.. ఇప్పుడు గ్రీన్లాండ్: ఇలా కొనుక్కోవచ్చా?

అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరస్పర ఒప్పందంతో ఇతర దేశాల భూభాగాలను కొనడం సాధ్యమే. 1867లో $7.2Mతో రష్యా నుంచి అలాస్కాను US కొనుగోలు చేసింది. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలోనూ అలాంటి చర్చలే జరుగుతున్నాయి. గ్రీన్లాండ్ ప్రస్తుత విలువ సుమారు $700B పైమాటే. అయితే నేటి ఆధునిక చట్టాల ప్రకారం.. కేవలం డబ్బుతోనే కాకుండా ప్రభుత్వాల మధ్య అంగీకారం, స్థానిక ప్రజల ఆమోదం తప్పనిసరి. బలవంతపు ఆక్రమణకు UN రూల్స్ ఒప్పుకోవు.
News January 22, 2026
పెద్దవాళ్ల సబ్బునే పిల్లలకూ వాడుతున్నారా?

చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వారికి వాడే ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే చాలామంది పిల్లలకు సంవత్సరం దాటిన తర్వాత పెద్దవాళ్ల సబ్బులే వాడుతుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల వారికి చిరాకు, అలర్జీ వచ్చే అవకాశముందంటున్నారు. పిల్లల ఉత్పత్తుల్లో పారబెన్స్, మినరల్ ఆయిల్స్, సల్ఫేట్స్ లేకుండా pH5.5% ఉండేలా చూసుకోవాలంటున్నారు.
News January 22, 2026
అరటి సాగు – ఈ జాగ్రత్తలు తీసుకోండి

అరటి మొక్కలను నాటిన 6-8 నెలల్లో చెట్టు మొదలుకు మట్టిని ఎగదోస్తే చెట్టుకు బలం పెరుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వెదురు గడలు పాతి అరటి చెట్టుకు ఊతం ఇవ్వాలి. గెలలు నరికిన చెట్లను అడుగువరకు నరికేయాలి. గెల వేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగ పువ్వును కోసేయాలి. మగ పువ్వును కోసిన వెంటనే పాలిథీన్ సంచులను గెలలకు తొడిగితే పండ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా తయారవుతాయి.


