News December 20, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయంది.

Similar News

News December 21, 2024

చంద్రబాబు గారు విద్యార్థులకు ట్యాబ్‌లు ఎక్కడ?: జగన్

image

AP: తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఇప్పుడు ఏమయ్యాయని సీఎం చంద్రబాబును మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. ‘ప్రతి ఏటా రూ.15వేల అమ్మ ఒడి ఏది? 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఎక్కడ? విద్యా దీవెన, వసతి దీవెన, 3వ తరగతి నుంచి టోఫెల్, నాడు-నేడు పనులు ఎక్కడ? ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఎక్కడ? తల్లికి వందనం హామీ ఏమైంది? అమ్మ ఒడిని ఈ ఏడాది ఎందుకు ఎగ్గొట్టారు?’ అని ట్వీట్ చేశారు.

News December 21, 2024

TODAY HEADLINES

image

* KTRను 10 రోజుల వరకు అరెస్టు చేయొద్దు: హైకోర్టు
* కబ్జాలు చేసే వారి తాట తీస్తాం: చంద్రబాబు
* ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
* ధరణితో రైతుల సమాచారం విదేశాలకు వెళ్లింది: సీఎం రేవంత్
* భూభారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
* ఫిజిక్స్ వాలా కంపెనీతో ఒప్పందం: లోకేశ్
* బీఆర్ఎస్ పాలనంతా కచరా గవర్నెన్స్: అక్బరుద్దీన్
* కరెంటు దొంగిలించిన సంభల్ MP జియా ఉర్ బర్ఖ్‌కు ₹2 కోట్ల ఫైన్

News December 21, 2024

ఆ జాబితాలో అత్య‌ధికులు గుజ‌రాతీలే

image

<<14937075>>అమెరికా పౌర‌సత్వం<<>> పొందుతున్న వారిలో అత్య‌ధికులు గుజ‌రాతీలు ఉన్న‌ట్టు US Immigration అధికారులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో భారతీయలు, ముఖ్యంగా గుజ‌రాతీలు అమెరికాకు శ‌ర‌ణార్థిగా వెళ్తున్నారు. జాతి, మ‌తం, రాజ‌కీయ సిద్ధాంతాల వ‌ల్ల స్వ‌దేశంలో హింస ఎదుర్కొంటున్న శ‌ర‌ణార్థులుగా అమెరికాలో ఆశ్ర‌యం పొందుతున్నారు. అనంత‌రం ప‌త్రాలు లేక‌పోయినా ప‌నిలో చేరి పౌర‌స‌త్వం పొందుతున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.