News August 28, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Similar News

News December 31, 2025

డాంగ్ టావో కోడి.. కేజీ మాంసం రూ.1.50 లక్షలు

image

‘డాంగ్ టావో’ వియత్నాంకు చెందిన కోడి. దీని ఆకారం చాలా వింతగా ఉంటుంది. ఈ కోడి పాదాలు కాస్త లావుగా ఉంటాయి. వియత్నాం రెస్టారెంట్లలో ఈ కోడి మాంసం చాలా స్పెషల్. ఇక్కడి ప్రజలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ కోడి మాంసాన్ని తినకపోతే తప్పుగా భావిస్తారు. అందుకే ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఈ కోడి మాంసాన్ని తింటారు. ఇంత డిమాండ్ వల్లే ఈ మాంసం కిలో దాదాపుగా రూ.1.50 లక్షలుగా ఉంటుంది. సీజన్ బట్టి ధరల్లో మార్పు ఉంటుంది.

News December 31, 2025

నిమ్మకాయ దీపం వెలిగిస్తూ చదవాల్సిన మంత్రాలు..

image

‘ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’ అనే మంత్రం పఠిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ‘సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే’ శ్లోకాన్ని చదువుతూ దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయి. ఇవి మనసులో సాత్విక భావనను పెంచి, ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి శాంతిని చేకూరుస్తాయి. దీపారాధన చేసే సమయంలో ఏకాగ్రతతో అమ్మవారిని స్మరించడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుంది.

News December 31, 2025

110 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<>NALCO<<>>) 110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BTech/BE (మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) అర్హత గలవారు జనవరి 2 నుంచి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. GATE 2025 స్కోరు, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://mudira.nalcoindia.co.in