News June 27, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News December 30, 2024

స్పేస్ డాకింగ్: నాలుగో దేశంగా భారత్

image

ISRO చేపడుతోన్న ‘స్పేడెక్స్ మిషన్’ సక్సెస్ అయితే ప్రపంచంలో స్పేస్ డాకింగ్ సాంకేతికత కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ టెక్నాలజీ విషయంలో US, రష్యా, చైనా ముందంజలో ఉన్నాయి. చంద్రయాన్-4, ఇండియన్ స్పేస్ సెంటర్ వంటి భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ఈ డాకింగ్ టెక్నాలజీ కీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ తెలిపారు.

News December 30, 2024

ఒక్క సిగరెట్‌ తాగితే ఎంత జీవితం నష్టపోతారో తెలుసా?

image

ఒక సిగ‌రెట్ తాగ‌డం వ‌ల్ల పురుషులు 17 నిమిషాలు, మహిళలు 22 నిమిషాల జీవితాన్ని కోల్పోతున్నార‌ని ఓ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు దీనిపై అధ్య‌య‌నం చేశారు. ధూమ‌పానం వ‌ల్ల‌ ఎన్నేళ్ల జీవితాన్ని కోల్పోతారో, అన్నే ఏళ్లపాటు ఆరోగ్యంగా జీవించే కాలాన్ని కూడా కోల్పోతార‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. జీవితం చివ‌ర్లో కంటే ఆరోగ్యవంతమైన మధ్య వయస్సును హ‌రిస్తుంద‌ని వివరించారు.

News December 30, 2024

యూట్యూబ్‌లో టెన్త్ పేపర్.. నిందితుడు అరెస్ట్

image

AP: టెన్త్ హాఫ్ ఇయర్లీ పరీక్ష పేపర్లను యూట్యూబ్‌లో <<14900742>>అప్‌లోడ్ చేసిన<<>> అరుణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఎడ్యుకేషన్ కౌన్సిల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జామ్‌కు ముందు రోజు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌ను అరుణ్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ పరీక్షను రద్దు చేసి ఈ నెల 20న నిర్వహించారు.