News July 29, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA
AP: పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. కాకినాడ, కృష్ణా, NTR, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Similar News
News February 1, 2025
నెట్ఫ్లిక్స్లో టాప్ ట్రెండింగ్లో ‘పుష్ప 2’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీకి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నెట్ఫ్లిక్స్లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది. టాప్-10 మూవీస్లో ఈ సినిమా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ మూవీ గత నెల 30న ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. కాగా ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు రూ.1,900 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
News February 1, 2025
Stock Markets: రైల్వే, డిఫెన్స్ షేర్లపై ఫోకస్
దేశీయ స్టాక్మార్కెట్లు నేడు నష్టాల్లో మొదలై రేంజుబౌండ్లో కదలాడే సూచనలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్నిఫ్టీ 97 పాయింట్ల మేర నష్టపోవడం దీనినే సూచిస్తోంది. బడ్జెట్ మొదలయ్యాక సెంటిమెంటును బట్టి ఎటువైపైనా స్వింగ్ అవ్వొచ్చు. వృద్ధి, వినియోగం, ఇన్ఫ్రా, SMEలపై ఫోకస్ నేపథ్యంలో రైల్వే, డిఫెన్స్, బ్యాంక్స్, PSE షేర్లపై ఆసక్తి నెలకొంది. బడ్జెట్ కావడంతో శనివారమైనా స్టాక్మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.
News February 1, 2025
నిలిచిపోయిన పెన్షన్ల పంపిణీ?
AP: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. సర్వర్లో సమస్య రావడంతో పింఛన్ల పంపిణీ ప్రారంభమైన కాసేపటికే నిలిచిపోయినట్లు సమాచారం. సమస్యను పరిష్కరించి పింఛన్ల పంపిణీని కొనసాగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.