News December 5, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Similar News

News February 14, 2026

శివానుగ్రహం పొందాలంటే ఇలా చేయండి!

image

రేపే మహాశివరాత్రి. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే తల స్నానమాచరించి రోజంతా ఉపవాసం ఉండాలని పండితులు సూచిస్తున్నారు. రాత్రంతా నిద్రపోకుండా లింగోద్భవ కాల పూజలు, జాగరణ చేస్తూ శివనామ స్మరణ చేయాలని చెప్పారు. శివునికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలతో పూజించడం, పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేష పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండాలి. రోజంతా భక్తితో గడపాలని చెబుతున్నారు.

News February 14, 2026

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ భువనేశ్వర్‌లో ఉద్యోగాలు

image

<>భువనేశ్వర్‌లోని<<>> ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ 7 అసిస్టెంట్ ప్రొఫెసర్/రీడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 28 వరకు అప్లై చేసుకోవచ్చు. థియోరిటికల్ హై ఎనర్జీ ఫిజిక్స్, థియోరిటికల్ కండెన్స్ మ్యాటర్ ఫిజిక్స్, ఎక్సపర్మెంటల్ కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్ విభాగంలో పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. రీడర్‌కు 38ఏళ్లు. వెబ్‌సైట్: https://www.iopb.res.in

News February 14, 2026

T20 WC: మరో సంచలనం తప్పదా!

image

స్కాట్లాండ్‌తో మ్యాచులో ఇంగ్లండ్‌ తడబడుతోంది. 153 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టు ప్రస్తుతం 97 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. విజయానికి 48 బంతుల్లో 56 రన్స్ అవసరం. ఇది ఇంగ్లండ్‌కు పెద్ద విషయమేమీ కాదు. కానీ మరో 2 వికెట్లు పడితే ఛేజింగ్ కష్టం కానుంది. నిన్న ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఈరోజు కూడా మరో సంచలనం నమోదవుతుందా? కామెంట్ చేయండి.