News August 29, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 5వ తేదీ నాటికి అది వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
Similar News
News August 29, 2025
శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ.. జింబాబ్వేకు హార్ట్ బ్రేక్

జింబాబ్వేతో తొలి వన్డేలో శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఆ జట్టుపై 7 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 298/6 పరుగులు చేసింది. నిస్సాంక(76), లియనగే(70*) రాణించారు. ఛేదనలో జింబాబ్వే 291/8 పరుగులు చేసి పోరాడి ఓడింది. సికందర్ రజా(92) ఒంటరి పోరాటం చేశారు. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా శ్రీలంక బౌలర్ మధుశంక హ్యాట్రిక్ వికెట్లు తీసి, 2రన్సే ఇచ్చారు.
News August 29, 2025
ఇక నుంచి వేగంగా పెన్షన్లు: మంత్రి సీతక్క

TG: పెన్షన్లను వేగవంతంగా, పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చిందని మంత్రి సీతక్క తెలిపారు. ఇందుకోసం ₹15.50Crతో 5G ఆధారిత L1 ఫింగర్ ప్రింట్ పరికరాలు, కొత్త ఫోన్లను రాష్ట్రంలోని బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ములుగు(D)లో మంత్రి ఈరోజు ప్రారంభించారు. వేలిముద్ర సమస్య ఉన్న వారికి ఈ విధానం మేలు చేస్తుందన్నారు.
News August 29, 2025
రుషికొండ ప్యాలెస్‌పై మంత్రులతో కమిటీ

AP: రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా కందుల దుర్గేశ్, పయ్యావుల కేశవ్, డీబీవీ స్వామిని నియమించింది. వీరు ఈ రిసార్ట్‌ను ఎలా వినియోగించాలనే దానిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఆ నివేదిక ప్రకారం సర్కార్ చర్యలు తీసుకుంటుంది.